
పాక్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తన ఎయిర్ వింగ్ కోసం 1970లో కిరానా హిల్స్ ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. ఇక్కడ 4,091 స్క్వాడ్రన్ తో పాటు ఒక రాడర్ స్టేషన్ కూడా నిర్మించింది. 1978-79 ఇక్కడ దాయాది ఆర్మీ కోర్ అఫ్ ఇంజనీర్స్ .. టెస్ట్ సైట్ ను నిర్వహించింది. ఆ తర్వాత ఇక్కడ న్యూక్లియర్ కార్యక్రమాలు జరిగాయి. రీసెర్చ్, టెస్ట్ లు ఇట్టి వాటిని జరిపినట్టు తెలుస్తోంది. దీనికోసం అనేక రకాలైన సొరంగాలు తవ్వారు. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ 46 చిన్న సొరంగాలు ఉన్నాయి. భారీ విస్పోటనాలు తట్టుకునే విధంగా పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ అనేక జాగ్రత్తలు తీసుకుంది.
పాక్ పై అమెరికాకు ఎప్పుడూ నమ్మకం ఉండదు. అందువల్లే అమెరికాను సైడ్ ట్రాక్ పట్టించి కేవలం నైట్ టైం లోనే ఇక్కడ డ్రిల్లింగ్ వర్క్స్ జరిగాయి. ప్రాంతంలో ఉన్న జంతువులను వేరే ప్రాంతానికి పాక తరలించింది.. అంతేకాదు ఇక్కడ మల్టీ లెవెల్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసింది.. గతంలో ఈ ప్రాంతంలో చైనా తయారు చేసిన ఎం -11 మిసైల్స్ ను పాక్ స్టోరేజ్ చేసింది. దానిని అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పసిగట్టింది. ఆ తర్వాత వాటిని రహస్య ప్రాంతానికి పాకిస్తాన్ తరలించింది. ముఖ్యంగా క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పై నిరంతరం నిఘా ఉండేది. దీంతో కైబర్ పుంఖ్వా ఏరియాలో అత్యంత రహస్య ప్రాంతానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ తరలించినట్టు తెలుస్తోంది. భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ విషయం తెలుగులోకి వచ్చింది. మొత్తానికి కిరానా హిల్స్ ను భారత్ టార్గెట్ చేసిందని దాయాది చెప్పడం.. దానిని మన ఆర్మీ దృవీకరించడంతో.. అసలు విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.. ఇదే విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి ప్రముఖంగా ప్రస్తావించారు..” అక్కడ ఏమన్నా మాకు సంబంధం లేదు. కాకపోతే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఓపెన్ గానే చెప్పేసింది. ఇది ప్రపంచానికి తెలిసిపోయింది. కాకపోతే మా టార్గెట్ ఆ హిల్స్ కాదు. మేము దానిని టార్గెట్ చేయలేదని” భారతి స్పష్టం చేశారు.