
కియా ఇండియా ఇటీవల భారతదేశంలో సరికొత్త కేరెన్స్ క్లావిస్‌ను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా బ్రాండ్ సరికొత్త ఎంపీవీ వచ్చినప్పటికీ ఇప్పటికే ఉన్న కేరెన్స్‌ను ఆపేయలేదు. కాబట్టి రెండు ఎంపీవీ మోడల్లను భారతీయ మార్కెట్లో ఒకేసారి విక్రయిస్తారని భావించారు. అయితే, ఇప్పుడు కియా ప్రీమియం (O) మినహా కేరెన్స్ ఎంపీవీ పాత మోడల్ అన్ని వేరియంట్లను నిలిపివేసినట్లు తెలిసింది. కియా కేరెన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో ఒకే మోడల్ ప్రీమియం (O)లో అందుబాటులో ఉంటుంది.
కియా కేరెన్స్ ప్రీమియం (O) ధర నేచురల్ ఆస్పిరేటెడ్ 1.5L పెట్రోల్ ఇంజన్ రూ.11.41 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే iMT గేర్‌బాక్స్ ఉన్న 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ ధర రూ.12.65 లక్షలు. దీని తర్వాత 1.5L డీజిల్ వేరియంట్ ధర రూ.13.16 లక్షలు. ఇక్కడ పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. ప్రీమియం, గ్రావిటీ, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్రెస్టీజ్ ప్లస్, ప్రెస్టీజ్ ప్లస్ (O), లగ్జరీ ప్లస్, ఎక్స్-లైన్ వంటి అన్ని ప్రస్తుత ట్రిమ్‌లను భారతీయ మార్కెట్ నుంచి తొలగించారు.
కియా కేరెన్స్ ప్రీమియం (O) కారు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. ఇందులో ఒక బటన్‌తో సీటును అడ్జస్ట్ చేయడం, మధ్య సీట్లలో రూఫ్ ఫ్లష్డ్ డిఫ్యూజ్డ్ ఏసీ వెంట్, డ్యూయల్-టోన్ సెమీ లెదరెట్ బ్లాక్, ఇండిగో సీట్లు, రిక్లైనింగ్, టంబుల్తో 60:40 స్ప్లిట్ సీట్లు, 5 USB టైప్ సి పోర్ట్‌లు, కీ లెస్ ఎంట్రీ, LED టర్న్ సిగ్నల్‌తో ఎలక్ట్రిక్ అడ్జస్ట్ అవుట్‌సైడ్ మిర్రర్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.
కియా కేరెన్స్ ఇప్పుడు కేవలం 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, VSM, BAS, HAC, DBC (డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హైలైన్ TPMS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS, ISOFIX చైల్డ్ యాంకర్ల వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. కేరెన్స్ ఎంపీవీ ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్, స్పార్కిల్ సిల్వర్, ఆరోరా బ్లాక్ పెర్ల్ వంటి ఏడు రంగుల్లో లభిస్తుంది.