అయితే ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని, ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమ వ్యూహంలో భాగంగానే నీటిని రిలీజ్ చేసిందని అనుమానం వ్యక్తం చేసింది. భారత్లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి ప్రవేశిస్తున్నట్టు సమాచారం. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సింధూ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయిం తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
