
జపాన్ లో వివాహం చేసుకొని విడిపోవాలంటే జంటలు భయపడుతుంటారు. ఎందుకు అనే అనుమానం వచ్చిందా? దానికి ప్రధానం కారణం విడిపోయిన తర్వాత మరో వివాహానికి మధ్య ఉండే గ్యాప్. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అయితే జపాన్లో విడాకులకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు విడాకుల తర్వాత కొంతకాలం తిరిగి వివాహం చేసుకోలేరు. ఇంతకీ జపాన్ లో కఠినంగా ఉన్న ఆ నియమాలు ఏంటో తెలుసుకుందామా?
జపాన్లో వివాహాలకు సంబంధించిన సామాజిక నిర్మాణం ఎలాంటిదంటే అక్కడి కుటుంబాలు వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అక్కడి ప్రజలు ఒకరికొకరు స్పేస్ ఇవ్వడాన్ని నమ్ముతారు. అందుకే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు స్పేస్ ఇచ్చిపుచ్చుకుంటారు. సో ఎక్కువ గొడవల జరగవు. జపాన్లో వివాహాలు ఎక్కువ కాలం ఉండటానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. కానీ అక్కడ విడాకులు ఉంటే, స్త్రీలు తిరిగి వివాహం చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
జపాన్లో, విడాకుల తర్వాత ఒక మహిళ 100 రోజుల వరకు తిరిగి వివాహం చేసుకోకూడదు. అయితే, ఈ సందర్భంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మాజీ భర్తను తిరిగి వివాహం చేసుకున్న సందర్భంలో లాగా అన్నమాట. గతంలో జపాన్లో, ఒక మహిళ తన మునుపటి వివాహం ముగిసిన ఆరు నెలలలోపు లేదా విడాకులు తీసుకున్న ఆరు నెలలలోపు వివాహం చేసుకోకూడదు. ఈ నియమం మహిళలకు మాత్రమే, పురుషులకు కాదు.
అయితే, దాదాపు మూడు సంవత్సరాల క్రితం, జపాన్ క్యాబినెట్ 100 రోజుల విడాకుల తర్వాత పునర్వివాహం అనే నియమాన్ని మార్చింది. ఈ చట్టం ప్రకారం, విడాకులు తీసుకున్న మహిళలు తమ ఇష్టానుసారం ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చు. జపాన్ పాత చట్టం 1896 నుంచి అమలులో ఉంది. ఈ నియమం పురుషులకు వర్తించదు. నిజానికి, బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గకుండా ఉండటానికి ఈ నియమాన్ని అమలు చేశారు. ఈ చట్టాన్ని 2016 సంవత్సరంలో సవరించారు. అయితే గతంలో జపాన్ సివిల్ కోడ్ ఆర్టికల్ 733 విడాకులు తీసుకున్న తర్వాత మరింత కఠినంగా ఉండేది ఈ నియమం. అంటే ఆరు నెలల వరకు మహిళలు తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతించలేదు.