
ఇక జైలర్ మొదటి పార్ట్ లో చేసిన మోహన్ లాల్, శివన్న లు జైలర్ 2 లో కూడా క్యామియో రోల్ చేస్తున్నారు. ఇక వీళ్ళతో పాటుగా తెలుగు నుంచి బాలయ్య బాబుని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు కి సంబంధించిన సీన్స్ షూటింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే బాలయ్య బాబు ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మరి ఆయన కనిపించేది చాలా తక్కువ సమయమే అయినప్పటికి అందులో భారీ ఎలివేషన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
జైలర్ మొదటి పార్ట్ లో ఏ విధంగా అయితే శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇచ్చారో ఇందులో అంతకు మించి ఎలివేషన్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారట. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని, బాలయ్య బాబు ఆ క్యారెక్టర్ లో సింహంలా గర్జిస్తాడా లేదా అనేది తెలియదు.