
దాదాపు మూడు సంవత్సరాల పాటు కరోనా మన దేశ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత క్రమంగా ప్రపంచం కోలుకోవడం మొదలైంది. మన దేశం కూడా అన్ని రంగాలలో మునుపటి స్థితిని సాధించడం ప్రారంభించింది. అయితే, ఇప్పుడు మళ్లీ కరోనా హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో కరోనా సోకిన ఇద్దరు మరణించడంతో తాజాగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మరియు 54 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అయితే, వీరికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 19 నాటికి మన దేశంలో 257 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఇటీవల ఆసియా ఖండంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఇద్దరు మరణించడంతో ఆందోళన నెలకొంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదని, కొత్త వేరియంట్ ఏమిటో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ వేరియంట్ ప్రాణాలకు పెద్దగా ముప్పు కలిగించదని వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందడానికి కారణాలను పరిశోధకులు ఆరా తీస్తున్నారు. చైనాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి లేదని, వాతావరణ మార్పుల వల్ల కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ముంబైలో జరిగిన రెండు మరణాలు కేవలం కరోనా వల్ల మాత్రమే కాదని, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, అందువల్లే మరణించారని వైద్యులు తెలిపారు.