
భారత్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పర్యటన నేడు జరగనుంది. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న అబ్బాస్ కు స్వాగతం లభించింది.ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో ఇరాన్ విదేశాంగమంత్రి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ, రేపు ఇరాన్, భారత్ సంయుక్త కమిషన్ సమావేశాలు జరగనుండటంతో ఆయన భారత్ కు చేరుకున్నారు.
రెండు దేశాల మధ్య…
ఇరాన్ విదేశాంగమంత్రితో భేటీకానున్న భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. భారత్, ఇరాన్ ల మధ్య సయోధ్య నెలకొనడానికే ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ సమావేశాలు ఉపయోగపడుతాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది.