
ఐపీఎల్ సీజన్ లో ఏ జట్టు ముందుకు దూసుకు వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఐపీఎల్ చివరి దశకు వచ్చేసరికి అనేక మ్యాజిక్ లు చోటు చేసుకుంటున్నాయి. అంచనాలు ఎక్కువగా ఉన్న జట్లు ఇబ్బంది పడుతుండగా, అంచనాలు లేని జట్లు ముందుకు వస్తాయని అందరూ అనుకున్నప్పటికీ చివరకు మళ్లీ కొన్ని జట్లు మాత్రం ఇప్పడు రేసులో ముందున్నాయి. ఆరంభంలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపిన జట్లు చివర్లోకి వచ్చేసరికి డీలాపడుతుండగా,మొదట్లో వైఫల్యాలతో ఆటను మొదలుపెట్టిన జట్లు ఊహించని విధంగా ముందుకు దూసుకు వస్తున్నాయి.
నేడు సూపర్ మ్యాచ్…
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుది. ముంబయి ఇండియన్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమయింది. ముంబయి ఇండియన్స్ జట్టు పదకొండు మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లు గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు పది మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో గెలిచి మూడు మ్యాచ్ లలో ఓండింది. దీంతో పాయింట్ల పట్టికలో చెరి పథ్నాలుగు పాయింట్లతో సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.