
ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకునే సమయానికి అనుకోని విజయాలు కొన్ని జట్లు అందుకుంటుండగా, మరికొన్ని జట్లు మాత్రం అనూహ్యంగా ఓటమిని మూటగట్టుకుంటున్నాయి. గత కొద్ది రోజుల్లోనే ఆరంభంలో అదరగొట్టిన జట్టు ఓటములతో డీలా పడుతుండగా, ఓటములతో కుంగిపోయినట్లు కనిపించిన జట్లు తేరుకుంటున్నాయి. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ వెరీ వెరీ స్పెషల్. ప్లే ఆఫ్ రేసు కోసం నాలుగు జట్లు ఉంటాయి. పది జట్లు అందుకోసం పోటీ పడుతున్నాయి. చివరకు ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరో కీలక మ్యాచ్…
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచింది. ఏడింటిలో ఓటమిని చవి చూసింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో గెలిచి పది పాయింట్లతో పరవాలేదనిపిస్తుంది. మూడు మ్యాచ్ లలో ఓటమి పాలయి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పంజాబ్ కింగ్స్ పదకొండు పాయింట్లతో రేసులో ఉంది.