
ఐపీఎల్ లో మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు మాత్రమే మిగులుతాయి. ఇప్పటికే కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులో దూసుకు వెళ్లగా కొన్ని జట్లు మాత్రం ఇంకా రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ జట్లు చివరకు మిగులుతాయన్నది చెప్పకపోయినా ఫేవరెట్ జట్లు మిగలాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పాటు ముంబయి ఇండియన్స్ జట్లు రెండు ప్లే ఆఫ్ రేసులోకి రావాలని ఎక్కువ మంది ఆంకాక్షిస్తున్నారు.
కీలక మ్యాచ్….
దీంతో నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ మ్యాచ్ జరగనుంది. నేడు ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకూ పది మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. పన్నెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకూ పది మ్యాచ్ లు ఆడితే అందులో మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచ్ లలో ఓడింది. పాయింట్ల పట్టికలో చివరలో ఉంది. దీంతో జైపూర్ లో జరుగుతుండటంతో పోటీ ఆసక్తికంగా మారనుంది.