
ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఓటమి పాలయింది. రెండు వందలపైన ఉన్న లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే తమదే విజయమంటూ టైటాన్స్ వీర విహారం చేసింది. ముఖ్యంగా బట్లర్ ఉతికి పారేశాడు. సెంచరీకి కొద్ది దూరంలో ఉన్నప్పటికీ చివరలో వచ్చిన తెవాతియా సిక్సర్, ఫోర్ కొట్టి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు శుభమన్ గిల్, సుదర్శన్ తక్కువ పరుగులకే అవుటయినా తమ ముందున్న లక్ష్యాన్ని అధిగమించేంత వరకూ బట్లర్ చేసిన పోరాటాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.
ఎక్కువ పరుగులే చేసినా…
తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ కాపిటల్స్ జట్టులో అభిషేక్ పోరల్ 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కరుణ్ నాయర్ 31 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసి ఓకే అని అనిపించినా అక్సర్ పటేల్ 39, స్టబ్స్ 31 పరుగులను చేయడంతో పాటు సాయికిశోర్ 37 పరుగులు చేయడంతో జట్టుకు మంచి స్కోరును అందించారు. మొత్తం ఇరవై ఓవర్లకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేయగలిగింది. నిజానికిగుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కాపిటల్స్ ఉంచినట్లయింది. గుజరాత్ కాపిటల్స్ జట్టులో బౌలర్లు సిరాజ్, అర్హద్, ఇషాంత్, సాయి కిషోర్ లు తలో వికెట్ తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయడంతో తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ కు తెరదిచంగలిగారు.
బట్లర్ ఉతకడంతో…
ఇత తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. మంచి ఊపుమీదున్న శుభమన్ గిల్ రనౌట్ గా అవుటయి వెనుదిరిగాడు. నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. సుదర్శన్ 36 పరుగులు చేశాడు. బట్లర్ నాటౌట్ గా నిలిచి 97 పరుగులు చేసి టీం విజయంలో కీలకంగా మారాడు. రూథర్ ఫర్డ్ కూడా 43 పరుగులు చేసి అవుట్ కావడంతో తెవాతియా వచ్చిఇన్నింగ్స్ ను ముగించాడు. 19.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ 204 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో తానే రారాజునంటూ నిలిచింది. ఢిల్లీ కాపిటల్స్ బౌలర్లలో కులదీప్ యాదవ్ ఒక్కడే ఒక వికెట్ తీయగలిగాడు. బట్లర్ సెంచరీ మిస్ అయినప్పటికీ విజయాన్ని జట్టుకు అందించాడు.