
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ రెడీ అయింది. ఈ నెల 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో 22వ తేదీన ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా ఇతర అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి.
Hyderabad: The Intermediate Board is all set to release the eagerly awaited intermediate results in Telangana.
It has been announced that the results will be released on the 22nd of this month by Deputy Chief Minister
Mallu Bhatti Vikramarka. The results of Inter first year and second year are going to be released simultaneously.
The Inter Board has revealed that Deputy CM Bhatti will release the results at 11 am on the 22nd at
the Intermediate Board office in Nampally.Inter Board Secretary Krishna Aditya and other officials are likely
to participate in this program. The Inter results will be available directly on the official website of the
Intermediate Board tsbie.cgg.gov.in or results.cgg.gov.in.