
హైదరాబాద్, మే 29, 2025: ట్రాన్స్జెండర్ సమాజానికి సంతోషకరమైన వార్త అందింది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనుంది. హైదరాబాద్ సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్జెండర్లను మంత్రి సీతక్క అభినందించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఆదర్శంగా పరిశీలిస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా, దివ్యాంగుల కోటాలో ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.