
భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో హై అలర్ట్ ను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్పోర్ట్ టర్మినల్స్లో సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు.భద్రతా దృష్ట్యా సివిల్ ఏవియేషన్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ లోని ఇరవై ఏడు ఎయిర్ పోర్ట్ లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ విమానాశ్రయాల్లో…
శ్రీనగర్, జమ్ము, లేహ్, చండీగఢ్, అమృత్ సర్, లూథియానా, పాటియాలా, బాథిండా, హల్వారా, పఠాన్ కోట్, భూంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్ గర్, జైసల్మేర్, జోథ్ పూర్, బికనీర్, ముంద్రా, జామ్ నగర్, రాజ్ కోట్, పోర్ బందర్, కాండ్లా, కేషోద్, భుజ్, గ్వాలియర్, హిండన్ ఎయిర్ పోర్టులను మూసివేస్తూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రాయాలను మూసివేసింది.