
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి భారత్ సిద్ధమైనట్లు తెలిసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లో తయారయ్యే అనేక వస్తువులపై సుంకాలు పెంచిన నేపథ్యంలో భారత్ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే భారత్లో తయారయ్యే ఉక్కుపై అమెరికా సుంకాలు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే అమెరికా…
దీంతో కొన్ని అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి భారత్ సిద్ధమైనట్లు తెలిసింది. నేడు మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలిపినట్టు తెలిసింది. నేడు కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.