
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. మూడు నెలల్లో విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు సంబంధం లేకుండా ఓబులాపురం మైనింగ్ కేసులో మరోసారి విచారణ చేపట్టాలాని సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైకోర్టు నిర్ణయాన్ని…
డిశ్చార్జ్ పిటీషన్ పై హైకోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో విచారణ చేపట్టాలని తెలిపింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై గతంలో సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.