
నేడు స్టార్ డైరెక్టర్లగా రాణిస్తున్న వారంతా ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారే. అసిస్టెంటెడ్ డైరెక్లర్టగా, రైటర్లగా రకరకాల విభాగాల్లో పనిచేసి టాప్ డైరెక్టర్లగా రాణిస్తున్నవారెంతో మంది. అలాంటి వాళ్లలో బాబి అలియాస్ కె.ఎస్ రవీంద్ర ఒకరు. `పవర్` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాబి ఎలాంటి హిట్లు ఇచ్చాడో చెప్పాల్సిన పనిలేదు. `జై లవకుశ`, `వెంకీ మామ`, `వాల్తేరు వీరయ్య`, `డాకు మహారాజ్` లాంటి విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
బాబి ప్రయాణం కూడా అసిస్టెంట్ గానే మొదలైంది. అయితే ఎదిగే క్రమంలో ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్న విషయం తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లంతా ఈ రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. కొంత మంది దర్శకులు తన తెలివి తేటలు వాడుకుని క్రెడిట కూడా ఇవ్వకుండా మోసం చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. అయినా ఏ రోజు తాను ఎదురు ప్రశ్నించలేదని… తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడంత తప్ప వాళ్ల నుంచి ఏదీ ఆశించలేదన్నాడు.
శాంతంగా పనిచేసుకుంటూ వెళ్లిపోవడమే అలవాటు చేసుకున్నట్లు తెలిపాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ను కూడా ఇండస్ట్రీలో ఇలా దోచుకున్న వారే. ఏకంగా తాను రాసిన కథతోనే తనకు తెలియకుండానే సినిమా తీసేసారని ఓ సందర్భంలో కొరటాల అన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి తెలివి దోపిడీలు అన్నవి జరుగుతూనే ఉంటాయి. అవతలి వారి ట్యాలెంట్ తొక్కేయాలని ఎంత మంది ఎన్నాళ్లు ఎదురు చూసినా? దానికి ఏదో ఒక రోజు పుల్ స్టాప్ పడుతుంది.
అగ్ని పర్వతం బద్దలైతే సక్సెస్ రూపంలోనే ఆ బ్లాస్టింగ్ ఉంటుందని బాబి, కొరాటల చూసారు. అలాగే బాబి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆకలి కష్టాలు ఎదుర్కున్నట్లు తెలిపారు. వాటిని కష్టాలు అనడం కంటే స్వీట్ మెమోరీస్ గానే వాటిని భావిస్తానన్నారు. తాను ఎక్కిన ఏ మెట్టు మర్చిపోలేదని ప్రతీ మెట్టు ఎలా ఎక్కానో తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. ఇప్పుడు కోట్ల రూపాయాలు పారితోషికం అందుకుంటున్నా ప్యారడైజ్ లో 40 రూపాయలకు చొక్కా కొన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు.