
Hyderabad Houses: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇళ్ల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమకు కావాల్సిన బడ్జెట్లో ఇళ్లు దొరక్క మధ్యతరగతి జనం ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు తగ్గిపోయాయి. 2024తో పోలిస్తే 2025లో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భారీ స్థాయిలో ఇళ్ల విక్రయాలు తగ్గిపోయాయని తాజాగా అనరాక్ ఒక రిపోర్ట్‌ని విడుదల చేసింది. వివరాలు చూద్దాం.
హైదారబాద్ అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రజలకు ఎంతో క్రేజ్. అంతేకాదు ఇది చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలకు కూడా అనువైన ప్రాంతం. అందుకే అటు నార్త్, ఇటు సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడిపోతారు. ఇలా ఇక్కడకు వచ్చిన వారిలో ఎక్కువమంది ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. మధ్యతరగతి వాళ్లు ఈఎమ్ఐలు చెల్లించి అయినా ఇళ్లు తీసుకోవాలని చూస్తారు. కానీ ఈ మధ్య వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో భారీస్థాయిలో ఇళ్ల రేట్లు పెరిగిపోయాయి. దీంతో కొనాలని ఉన్నా ఇళ్లను కొనలేకపోతున్నారు. ఈ ఏడాది 2025లో ఇళ్ల ధరలు పెరిగి, విక్రయాలు తగ్గిపోయాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ ఒక కొత్త నివేదికను వెల్లడించింది. సగటున 11 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగిపోయాయని ఈ తాజా రిపోర్ట్ చెబుతుంది. ఇదే సమయంలో ఇళ్ల విక్రయాలు సగటున 20 శాతం పడిపోయాయని రిపోర్ట్ వెల్లడించింది.
2024లో 1,20,335 ఇళ్లు, ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది 2025లో 96,285 ఇళ్లు ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఎప్పుడూ లేనంతగా ఈ సారి భారీగా తగ్గిపోయాయి. హైదారాబాద్‌తో పాటు మరో 7 నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూనె, కోల్ కత్తా సిటీల్లో కూడా విక్రయాలు బాగా తగ్గిపోయాయి. అయితే చెన్నై నగరంలో ఎక్కువ విక్రయాలు జరిగినట్లు రిపోర్ట్ చెబుతుంది.
అయితే, పాక్, ఇండియా మధ్య యుద్ధం వస్తుంది, రాదనే వాదనలు, ఇల్లు కొనేందుకు కాస్త సమయం తీసుకుందామనే ధోరణి, గత కొంతకాలంగా ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగిపోవడం వంటివి కారణాలు. అయితే ప్రస్తుతం యుద్ధం ఉద్రికత్తలు తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటివి జరిగాక ఇప్పుడు ప్రజలు ఇళ్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నట్టు కూడా�తెలుస్తోంది.