
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో.. భవనం మొదటి అంతస్తులో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అవును… హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనంలో నాలుగు కుటుంబాలు చిక్కుకున్నాయని అంటున్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. ముగ్గురు చిన్నారులతో సహా 14 మందికి గాయాలయ్యాయి! వీరందరినీ ఉస్మానియా, మలక్ పేట యశోద, అపోలో, డీఆర్డీవో ఆసుపత్రులకు తరలించారు.
ఈ సందర్భంగా ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు! మృతుల్లో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో 7 సంవత్సరాల బాలిక, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ భవనంలో మొత్తం 30 మంది ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో మంటలను అదుపుచేసేందుకు 10 ఫైరింజన్లు చేరుకున్నాయి. ఈ ఘటనలో మంటలు భారీ వ్యాపించదంతో చార్మినార్ కు వెళ్లే దారులు మూసివేశారు. ఇక.. ఘటన గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.