

Hyderabad: దొంగతనం చేస్తూ 26 సార్లు దొరికిపోయిన వ్యక్తి..కట్ చేస్తే..ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో చూడండి
Hyderabad: ఇటీవల కాలంలో చాలామంది లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిపోతున్నారు. దీనికోసం ఏ దారిలో వెళితే ఈజీమనీ వస్తుందా అని చూస్తున్నారు. ఆ దారి మంచిదో చెడ్డదో వాళ్లకు అవసరం లేదు. మనీ వచ్చిందా..జల్సాలు చేసామా? ఇదే వారి ధోరణి. ఇలాంటి ధోరణిలోనే ఉన్న ఒక వ్యక్తి ఇటీవల ఒక దొంగతనం చేసి దొరికిపోయాడు. అతగాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయిన నిజాలు బయటపడ్డాయి.
చాంద్రాయణగుట్ట పోలీసులు ప్రకారం, ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి(51) చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తుంటాడు. తన చిన్నప్పుడు పనిచేసిన కిరాణా షాపులో ఏకంగా తన ప్రియురాలికోసం దొంగతనం చేస్తాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోతాడు. ఇక అప్పటి నుండి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.
అయితే ఇలా దొంగతనాలతో వచ్చిన డబ్బులను ఏం చేస్తాడో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే సలీం వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తాడు. తనకు ఇష్టమొచ్చినవి కొనుక్కుంటూ, తింటూ, తాగుతూ తిరుగుతాడు. అంతేకాదు ఈ డబ్బుతో ముంబై, అజ్మేర్ వంటి పర్యాటక ప్రాంతాలకు హెలీకాఫ్టర్లో ప్రయాణిస్తూ జల్సా చేస్తుంటాడు. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్లీ దొంగతనం చేస్తాడు.
సలీం తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటి దొంగతనం చేశాడు. ఇప్పటివరకు 150 కి పైగా దొంగతనాలు చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే.. అందులో 26 సార్లు పోలీసులకు దొరికిపోయాడు. ఇటీవల బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో దొంగతనం చేశాడు. ఆ తర్వాత అరెస్టై జైలుకి వెళ్లాడు. పోలీసులు అతని వద్ద నుండి 70వేల రూపాయల నగదు, 35 గ్రాముల బంగారాన్నిస్వాధీనం�చేసుకున్నారు.