
హోండా ఎగుమతుల్లో కూడా 5శాతం క్షీణతను నమోదు చేసింది. ఏప్రిల్ 2024లో కంపెనీ ఎగుమతి మార్కెట్లో 60,900 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్లో 2024లో ఇదే కాలంలో 4,81,046 యూనిట్లు అమ్ముడయ్యాయి.. అంటే సుమారు 12శాతం మేర పతనం చెందిందన్న మాట. గత కొన్ని నెలలుగా హోండా టూ-వీలర్స్ తన ICE (Internal Combustion Engine) వాహనాల కోసం కొత్త OBD-2B మోడల్స్ ప్రవేశ పెట్టడం మీదనే దృష్టి సారించింది. ఇటీవల హోండా డియో 125, హోండా షైన్ 100 లను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు.
మూడేళ్ల ఫ్రీ సర్వీసింగ్ ఆఫర్
హోండా టూ-వీలర్స్ ఇండియా కొత్త యాక్టివా 110, యాక్టివా 125 మోడళ్ల కొనుగోలుపై మూడేళ్ల ఫ్రీ సర్వీసింగ్ ప్యాకేజీ, రూ.5,500 వరకు అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. హోండా యాక్టివా 110,హోండా యాక్టివా 125 రెండూ 2025లో అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు అవి OBD 2B-కంప్లైంట్ ఇంజన్లను కూడా కలిగి ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లు భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఉన్నాయి. ఈ ఆఫర్లు కేవలం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కొత్త స్కూటర్ లాంచ్ చేసే ఆలోచనలో హోండా
హోండా భారతదేశంలో PCX160 మ్యాక్సీ-స్కూటర్ కోసం డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. ఇది ప్రీమియం 160సీసీ స్కూటర్ సెగ్మెంట్లో బ్రాండ్ ఎంట్రీకి సిగ్నల్. అయితే లాంచ్ సమయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చర్య హోండా చివరకు ఇక్కడ ప్రీమియం 160సీసీ స్కూటర్‌ను ప్రారంభించే ప్రణాళికలో ఉందని సూచిస్తుంది. ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో విక్రయించబడుతున్న హోండా PCX160 నేరుగా యమహా ఏరోక్స్ 155, ఇటీవల విడుదలైన హీరో జూమ్ 160 లకు పోటీనిస్తుంది.