పెహల్గా ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, పోరాటానికి సన్నద్ధతగా భారత త్రివిధ దళాలు యుద్ధ విన్యాసాలు చేపట్టాయి, భారత ఆర్మీ చీఫ్ కశ్మీర్లో పర్యటిస్తూ ఉండగా, పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు, సరిహద్దుల్లో ఇరువైపుల భారత్ పాక్ భారీగా బలగాలు మోహరించాయి.
సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేయడంతో నియంత్రణ రేఖను గౌరవించకుండా ముందుకు దూసుకువెళ్ళే అవకాశం ఇప్పుడు భారత్ వద్ద ఉంది, పహల్గాం ఉగ్రదాడి ఘటన సూత్రధారి పాకిస్తాన్ పై నేరుగా భారత్ ఎలా ప్రతికారం తీర్చుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయా అంశంగా. మారింది భారత్ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణలు చెప్తున్నారు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది, భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వెంటనే రంగంలోకి దిగేందుకు త్రివిధ దళాలు సన్నద్ధమయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాయి, భారత వాయుసేన నౌకా దళం పదాతి దళం యుద్ధ సన్నాహాలను తీవ్రతరం చేశాయి, భారత వైమానిక దళం సెంట్రల్ సెక్టార్ లో ఆక్రమణ పేరిట యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఇందులో భారత్ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫెల్ సహా సుఖోయ్ 30 ఇతర యుద్ధ విమానాలు పాల్గొన్నాయి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేనా ఈ యుద్ధ విన్యాసాలను చేపట్టడం గమనార్హం. పర్వతాలు మైదాన ప్రాంతాల్లో ఉన్న టార్గెట్లను యుద్ధ విమానాలు చేదించాయి, సుదూర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలపై సైతం రఫెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి, భారత వైమానిక దళం వద్ద రెండు రఫెల్ స్క్వాడ్రన్లు ఉండగా ఒకదాన్ని పంజాబ్ లోని అంబాల వద్ద మరొకదాన్ని పశ్చిమ బెంగాల్ లోని హషీమారా వద్ద మోహరించారు.
మరోవైపు భారత నౌకదళం కూడా అప్రమత్తంగా ఉంది అరేబియా సముద్రంలో పాకిస్తాన్ క్షపణి ప్రయోగాలు చేయకముందే, భారత క్షపణలను విజయవంతంగా పరీక్షించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేదించినట్లు నౌకాదళం వెల్లడించింది. అటు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతి కూడా అరేబియా సముద్రంలోకి వచ్చింది, ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది.
పహల్గా ఉగ్గురదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవలపై వెళ్ళిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు, జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది, జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రత దళాలను మోహరించారు ఉగ్రవాదుల ఆచోకి కోసం వేట మొదలు పెట్టారు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్ కు చేరుకున్నారు, శ్రీనగర్ ఉదంపూర్‌లో ఆయన పర్యటిస్తున్నారు, కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు ఇతర భద్రత ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు
పహల్గా ముగ్గుల దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది, దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, దుశ్చర్యకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాకు పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కుంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది భయంతో సరిహద్దుల వద్ద పాక్ యుద్ధ విమానాలు మోహరించింది.
పహల్గాం ఉగ్రదాడి ఘటన సూత్రదారి పాక్ పై నేరుగా భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది, ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది, భారత్ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు, అందులో ఒకటి అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపడం, ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లైన రఫెల్ మిరాజ్ 2000 లను ఉపయోగించి పాక్ లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం, అదే సమయంలో బాలాకోటుపై దాడి అనంతర అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది, ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని చేదించే సామర్థ్యాలు వీటికి ఉన్నాయి, కాకపోతే ఈ ఆప్షన్‌ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవడానికి భారత సిద్ధంగా ఉండాలి, తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ బెదిరించింది, దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ దూకుడిగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తుంది, ఇటీవల ఎల్ఓసి వద్ద పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్ కు మంచి కారణాన్ని అందించాయి, ఈ క్రమంలో ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు చేపట్టవచ్చు, కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాలుగా మారవచ్చు, ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం ఎప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండటం ప్రతికూలంగా మారవచ్చు, భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కూడా భారత్ ఎదుట ఉన్న మరొక ఆప్షన్, కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండటంతో ఈ ఆపరేషన్లు దానిని షాక్ కు గురిచేయవు ఈ దాడులు అమలు చేయాలంటే రియల్ టైం ఇంటెలిజెన్స్ శక్తిమంతమైన దళాలు ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం, లక్ష్యాల పైకి గురిపెట్టి భారీ శతజ్ఞులు స్నైపర్ గన్స్ తో కాల్పులు జరపడం మరో ఆప్షన్ గా ఉంది, వీటితో పాటు భారీ మోటార్లు కూడా వాడొచ్చు, వీటివల్ల తక్కువ ఉద్రృక్తతలు తలెత్తుతాయి నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు సరఫరాల మార్గాలు అవుట్ పోస్ట్‌లను తుడిచి పెట్టొచ్చు.
