
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కి చెందిన పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలు కలిసి యాచకులకపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. లక్టో నగరంలో ఐదు వేలకు పైగా యాచకులు ఉన్నారు. వీరి సంపాదన గురించి తెలిసి సాఫ్ట్వేర్ జాబు చేసేవారు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారు. వారికి ఇతరుల వద్ద నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా ఉంటుందని తేలింది.
యాచకుల్లో సాధారణ వ్యక్తుల కంటే చిన్న పిల్లలతో కలిసి అడుక్కునేవారు ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తేలింది. వీరు రోజుకు 1000 నుంచి 3000 వరకు సంపాదిస్తున్నట్లు తేలింది. ఇందులో గర్భిణీలు కూడా ఉంటారు. అలాగే చిన్నపిల్లల సంపాదన కూడా భారీగానే ఉంది. చిన్నపిల్లలు అడుక్కొని రోజుకు 900 నుంచి 1500 వరకు సంపాదిస్తున్నట్లు తేలింది. వృద్ధుల సైతం కనీసం రోజుకు వెయ్యి రూపాయల వరకు అడుక్కున్నట్లు సర్వేలో తేలింది.
యాచకులకు నగదు ఇలా వస్తుంటే.. వారి ఖర్చులు మాత్రం ఎలాంటివి లేకుండా వారి ఆదాయం గలనీయంగా పెరుగుతుంది. వీరికి ఆహారం, బట్టలు వివిధ సంస్థలు ఉచితంగానే అందిస్తున్నాయి. అలాగే లయన్స్ క్లబ్ వంటి సంస్థలు ప్రతిరోజు ఆహారాన్ని అందించడంతో వీరికి ఎలాంటి ఖర్చు ఉండడం లేదు. అంతేకాకుండా వారికి వచ్చిన ఆదాయం సేవ్ చేయడంతో మిగతా వారి కంటే వీరిదే ఎక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
అయితే భిక్షాటన చేసేవారు తెలివితో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు డబ్బులు అడుక్కుంటూనే.. మరోవైపు ఎక్కడ ఉచితంగా ఆహారం లేదా దుస్తులు అందించే విషయాలను ముందే తెలుసుకొని వాటిని పొందుతున్నారు. అలాగే వృద్ధులు వృద్ధాశ్రమంలో.. ఇతరులు నిరాశ్రయుల కేంద్రంలో ఉంటూ నివాస ఖర్చు లేకుండా గడుపుతున్నారు. ఇక కొందరైతే చిన్న పిల్లలను ఎత్తుకొని ఎదుటివారి మనసును కలిసివేసి వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుక్కుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తుల పరిస్థితిని బట్టి వీరి ఆచరణ తీరు కూడా మారుతుంది. దీంతో డబ్బున్న వారి వద్ద మీరు ఎక్కువ మొత్తంలో అడుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా వీరి సంపాదన నెలకు లక్షకు పైగానే ఉంటున్నట్లు తేలింది.