
పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాల్ తమిళనాడులోని విల్లుపురం లో జరిగిన మిస్ విల్లూపురం ట్రాన్స్ జెండర్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ పోటీలకు మాజీ మంత్రి పొన్ముది కూడా మరో అతిథిగా విచ్చేశాడు. స్టేజి మీద కొంతమంది ట్రాన్స్ జెండెర్లు విశాల్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ తమ స్టైల్ లో ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. విశాల్ కూడా నవ్వుతూ వాళ్ళ అస్వీర్వాదాన్ని స్వీకరించారు. ఎంతో మందికి ఆయన సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు కూడా ఇచ్చాడు. అలా చాలా యాక్టీవ్ గా కనిపించిన విశాల్ కి సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ, స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వాళ్లంతా షాక్ కి గురయ్యారు. వెంటనే విశాల్ ని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. అధికారికంగా డాక్టర్ల నుండి ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల అవ్వలేదు. విశాల్ మ్యానేజర్ మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో విశాల్ సరిగా భోజనం తినడం లేదు. బాగా బలహీనపడ్డాడు. అందుకే అస్వస్థతకు గురి అయ్యి ఉంటాడని అనుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. సరైన స్పష్టత రాకపోవడం తో తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో ఏంటో అని అభిమానులు సోషల్ మీడియా లో కంగారు పడుతున్నారు. ఇకపోతే విశాల్ హీరో గా నటించిన ‘మదగజరాజా’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైంది. ప్రస్తుతం ఆయన ‘డిటెక్టివ్’ సీక్వెల్ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా ఆయన దర్శకత్వం కూడా వహిస్తుండడం విశేషం.