
‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించనున్న సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ కంటే ముందు బీజేపీతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా పొత్తు పెట్టుకోవడం పాన్ ఇండియా పరంగా కలిసొచ్చింది. ప్రధాని మోదీ పీకే గురించి ప్రశంసించడంతో పాన్ ఇండియాలో పీకే తన సినిమాల రిలీజ్ కంటే ముందే ఓ గుర్తింపు వచ్చింది.
ఇప్పుడా క్రేజ్ వీరమల్లు..ఓజీలకు పనికొస్తుందని రెండు చిత్ర యూనిట్ లు బలంగా విశ్వశిస్తున్నాయి. మరి పని కొస్తుందా? లేదా? అన్నది రిలీజ్ తర్వాత తేలుతుంది. అయితే ఇలాంటి సమయంలో పవన్ తో ఏ డైరెక్టర్ సినిమా తీయాలనకున్నా కచ్చితంగా పాన్ ఇండియా సినిమా అంటూ ముందుకొస్తారు. మార్కెట్ ను బేస్ చేసుకుని తీస్తే అన్ని భాషల్లోనూ సినిమా హిట్ అయితే లాభాలు భారీగా వస్తాయి.
భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఇలాగే ఆలోచిస్తారు. కానీ హరీష్ శంకర్ మాత్రం అలా ఆలోచించలేదు. ప్రస్తుతం హీరష్ …పీకే హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఉంటుందా? ఉండదా? అనుకున్న సినిమాకు పవన్ కళ్యాణ్ అనూ హ్యంగా డేట్లు కేటాయిం చడంతో సీన్ మారింది. అయితే ఇక్కడ హరీష్ శంకర్ ఏమాత్రం తొందర పడలేదు.
తాను రాసిన కథ ఆధారంగానే తీసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అనవసరంగా మార్కెట్ లో హడావుడి చేయడం లేదు. ఇంతవరకూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాన్ ఇండియా సినిమా అంటూ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి ప్రస్తుతానికి రీజనల్ మార్కెట్ ఆధారంగానే సినిమా చేస్తున్నట్లు తెలు స్తోంది. మరి షూటింగ్ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా ప్రకటన ఏదైనా వస్తుందా? అన్నది చూడాలి.