
తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అన్నిమద్యం షాపులకు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్సును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించడంతో మందుబాబులకు షాక్ అని చెప్పాలి. బీర్లు, చీప్ లిక్కర్ పై మాత్రం ధరలను పెంచలేదు. వాటిపై పాత పన్నులు యధాతధంగా ఉండనున్నాయి.
ధరలు ఇలా…
పెరిగిన ధరలు ప్రకారం క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు, హాఫ్ బాటిల్ పై ఇరవై రూపాయలు, ఫుల్లు బాటిల్ పై నలభై రూపాయలు పెరిగే అవకాశముంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకూ . స్పెషల్ ఎక్సైజ్ సెస్సును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయలేదు. 2020లో స్పెషల్ ఎక్సైజ్ సెస్సును ప్రబుెత్వం ప్రవేశపెట్టింది.