
ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని కోరుకునే వారికి గుడ్ న్యూస్. భారత సైన్యంలో్ ఇంటర్న్ షిప్ చేసేందుకు నోటిఫికేషన్ న విడుదల చేసింది. ఈ ఇంటర్నిష్ ప్రవేశానికి విద్యార్హతను డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. ఈ ఇంటర్న్ షిప్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు దేశ రక్షణ, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో డెబ్భయి ఐదు రోజుల హైబ్రిడ్ శిక్షణ అందిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు
మరో వారం రోజులు మాత్రమే…
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ మే 8వ తేదీ వరకూ మాత్రమే ఉంది. అంటే ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది.ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇదే గాక ఇంటర్న్‌లకు భారత సైన్యంలో కెరీర్ అవకాశాలు పెరుగుతాయి.ఈ ఇంటర్న్‌షిప్ ఈ ఏడాది మే 16 వతేదీ 2025 నుంచి 30 జూలై వరకు కొనసాగుతుంది.ఇంటర్న్‌షిప్ శిక్షణ ఢిల్లీలోని కాంట్‌లో జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25, 2025 నుంచి మే 7, 2025 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. https://www.joinindianarmy.nic.in పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.