పసిడి పరుగు ఆగడం లేదు రోజు రోజుకి సర్రున ఎగబాకుతూనే ఉంది, ప్రస్తుతం లక్ష్యకు అటు ఇటుగా ఊగిసలాడుతుంది ఈ దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరికిలక్ష 20వేల నుంచిలష25వేల రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది బులియన్ నిపుణుల అంచన.
అసలు పసిడి ధరల పెరుగుదలకు కారణాలుఏంటి ఏ ఏ అంశాలు పుత్తటి రేటుని ప్రభావితం చేస్తున్నాయి ఇలా పెరుగుతూ పోవడమే తప్ప దిగొచ్చే ఛాన్సే లేదా?
బంగారం ధర భగభగా మండుతుంది గత మూడు నాలుగు నెలల లెక్కలు చూస్తే, అమ్మో అనాల్సిందే. ఈ ఏడాది జనవరిలో 78వ000 రూపాయలు ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఫిబ్రవరి చివరికి 87000కు చేరింది మార్చిలో కాస్త నెమ్మదించింది ఏప్రిల్ రెండవ వారం వరకు కూడా 90,000 దగ్గరే కదలాడింది.
గత 10 రోజుల్లో 10వేల రూపాయలు పెరిగి ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలను దాటేసింది, ఇక్కడైనా ఆగుతుందా మరింత పెరుగుతుందా ఇదే ఇప్పుడు అందరి మదిని తొరుస్తున్న ప్రశ్న.
ఇప్పటిలాగే చిన్నపాటి హెచ్చు తగ్గులు ఉన్నా పెరగడమే తప్ప తగ్గే అవకాశం బాగా తక్కువే అంటున్నారు నిపుణులు
“ఇది ఇంక ఎన్ని రోజులు సాగుతుంది ఇలాగ అంటే గనుక నా పర్సనల్ అభిప్రాయం అయితే గనుక ఒక రెండు మూడు నెలలు మనం వేచి చూడాల్సింది ఎందుకంటే ఈ బేసల్ నార్మ్స్ ఒకటి ఇంప్లిమెంటేషన్ మేలో లాస్ట్ డేట్ ఉంది ఇంతవరకు యుఎస్ కూడా దాన్ని అడాప్ట్ చేయలేదు యుఎస్ చేస్తుందా లేదా చేస్తే దాని పర్యావసానం ఎలా ఉంటుంది చేయకపోతే దాని పర్యావసానం ఎలా ఉంటుంది అవన్నీ చాలా మేజర్ ఎకనామిక్ ఫాక్టర్స్ సో ఇవన్నీ ఒక స్టేజ్ కి వచ్చి సెటిల్ అయ్యేదాకా కూడా నా పర్సనల్ అభిప్రాయం గనుక గోల్డ్ రేట్స్ విత్ స్మాల్ కరెక్షన్స్ ఒక 100 200 అటు ఇటుగా మూవ్ అవుతూ పైకి వెళ్ళేవి కానీ తగ్గేవి మాత్రం కాదు. ”
ఇంతకీ బంగారం రేటు ఇంతలా ఎందుకు పెరుగుతుందనే కదా మీ డౌట్ దానికి నిపుణులు చెబుతున్న జవాబు ఒక్కటే, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడమే దీనికి కారణం అవును ఆఫ్రికా నుంచి అమెరికా దాకా బంగ్లాదేశ్ నుంచి భారతదేశం వరకు ఎక్కడ చూసినా ప్రజలు విపరీతంగా కొనేస్తున్నారు, ఇక బంగారాన్ని సెంటిమెంట్ గా భావించే ఇండియాలో అయితే మిగిలిన దేశాల కంటే కొనుగోలు బాగా ఎక్కువ.
2024 లో ప్రపంచవ్యాప్తంగా పొత్తడి కొన్న దేశాల్లో భారత టాప్ లో ఉంది భారతదేశ ప్రజల వద్ద ఉన్నటువంటి మొత్తం బంగారం ఎంతో తెలుసా, ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం సరాసరిన 25వేల టన్నులు ఉంటుందని అంచన, దీని విలువఎంతో ఊహించగలరా దాదాపుగా 250 లక్షల కోట్లు అంటే 2025 26 భారతదేశ బడ్జెట్‌కు, ఐదు రెట్లు ప్రపంచంలో సగానికి పైగా పసిడి భారత చైనాలోనే ఉంటుందట
జనం కొనడం ఒక్కటే కాదు భారత్ సహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలని భారీగా పెంచుకుంటున్నాయి, అందుకోసం పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి సెంట్రల్ బ్యాంకుల వాట, మొత్తం బంగారం కొనుగోళలో 20% ఉంటుంది, ఇది కూడా పసిడి బగబగలకు కారణం అవుతుంది ఆస్తిలో పసిడిని ఒక భాగంగా చేసుకునే అలవాటు పెరగడం, కష్టకాలంలో వడ్డుకు చేర్చే వస్తువుగా చూడటం కూడా ధరల జోరుకు కారణం అవుతుంది. షేర్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ కంటే బంగారంలో పెట్టుబడులు సేఫ్ అనే అభిప్రాయంతోను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఆభరణాల కొనుగోలుదారుల వాట సుమారు 30 నుంచి 35% వరకు ఉంటుంది, పెళ్లిళ్ల సీజన్ కు తోడు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రావడంతో వ్యాపారులు స్టాకిస్టులు నిల్వలు పెంచుకుంటున్నారు. దీనివల్ల దేశీయంగా గోల్డ్ డిమాండ్ మరింత పెరిగింది ఫండ్ హౌసెస్ 30 నుంచి 40% వరకు కొంటున్నాయి.
వీటికి తోడు స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ధరలని ప్రభావితం చేస్తున్నాయి, వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు కొంత కోలుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరితో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలు ఇప్పటికీ విడలేదు, అందువల్ల బంగారంపై పెట్టుబడలకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అమెరికా చైనా సుంకాల పోరాటంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది, మిగిలిన దేశాలపై సుంకాలను ట్రంప్ చిన్న బ్రేక్ ఇచ్చిన ఏ క్షణమైనా మళ్ళీ టాక్స్ బాంబు వేస్తారనే భయం వెంటాడుతుంది, గత ఐదేళ్లలో అగరరాజ్యం జీడిపి కంటే అప్పులు విపరీతంగా పెరిగాయి ఈ పరిస్థితుల్లో అమెరికా డాలర్ బాండ్లపై నమ్మకం సన్నగిల్లి పెట్టుబడిదారులంతా బంగారానికే ఓటు వేస్తున్నారు. ఎడతెగని రష్యా ఉక్రైన్ ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాలు కూడా అనిశ్చితికి కారణమై పసిటి పరుగులకు దోహదం అవుతున్నాయి.
“2020 లో యుఎస్ జీడిపి అండ్ యుఎస్ డెట్ రేటు రెండు సమానంగా ఉండేవి ఈ ఐదు సంవత్సరాల్లో అది బాగా పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ 120% ఆఫ్ ద జిడిపి యుఎస్ డెట్ ఉంది అంటే ఈ రోజున మనం యుఎస్ ని యస్ ఇట్ ఈస్ గా అమ్మేసినా కూడా వాళ్ళకు ఉన్న అప్పు తీరే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితుల్లో యుఎస్ ఎకానమీ వచ్చేసింది దాంతోటి అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డెప్స్ మీద గానీ లేదంటే బాండ్ మార్కెట్ మీద గాని వాళ్ళందరికీ డాలర్ మీద నమ్మకం సన్నగిల్లింది ఎప్పుడైతే డాలర్ మీద నమ్మకం సన్నగిల్లింది ఆటోమేటిక్ గా అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు గోల్డ్ మీద పెడుతున్నారు”
గత 10ఏళ్లుగా టెక్నాలజీ కంపెనీల నుంచి పుత్తడికి డిమాండ్ పెరిగింది, టెక్ సంస్థల నుంచే దాదాపుగా 7% కొనుగోళ్ళు ఉన్నాయట, మమశక్యం కావడం లేదా కానీ ఇది నమ్మి తీరాల్సిన విషయమే, చిప్స్ తయారీలో బంగారం వినియోగించడమే దీనికి ప్రధాన కారణం అట, ఎలక్ట్రానిక్స్ దంత వైద్యం అంతరిక్ష పరిశ్రమల్లోనూ ఉపయోగించడం కూడా బంగారం డిమాండ్ ను పెంచుతుంది, ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం కూడా ధరలు ఆకాశాన్ని అంటేలా చేస్తుంది, ఇలా వివిధ రూపాల్లో డిమాండ్ పెరగడం తగినంత సప్లై లేకపోవడం వల్ల ధరలు పై పైకి పోతూనే ఉన్నాయి.
ఎప్పటి నుంచి బంగారం ధరల మంట కొనసాగుతోంది అంటే 10 15 ఏళ్లుగా పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది అప్పుడప్పుడు కొంత మేర తగ్గినట్లు కనిపించిన, మళ్ళీ ఎగబాకడం సర్వసాధారణమైపోయింది. ఈ ఏడాది కాలంలో 40 %ాతనికి పైగా బంగారం ధర పెరిగిందని బులియన్ నిపుణలు గుర్తు చేస్తున్నారు, కోవిడ్ కాలం నుంచి ఇప్పటివరకు 100 %ాతనికి పైగా పెరుగుదల ఉందట, గత 10 ఏళ్లలో ఏకంగా 200 నుంచి 220% పెరుగుదల నమోదయిందంటే బంగారం ఎంతలా బగ్గుమంటుందో అర్థం చేసుకోవచ్చు, 2010 లో 10గ్రాముల బంగారం ధర 10,000 ఉండగా 15 సంవత్సరాల తర్వాత అంటే 2025, ఏప్రిల్‌లో లక్షకు చేరడం విశేషం
ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది చివరికి 10 గ్రాముల పసిడి ధరలక్ష 20వేల నుంచిలక్ష25వేలకు చేరే అవకాశం ఉందని బులియన్ నిపుణలు అంచనా వేస్తున్నారు.
