
* ఇద్దరి మధ్య సోదర భావం..
గాలి జనార్దన్ రెడ్డి( gaali Janardhan Reddy ) పేరుకే కర్ణాటక బిజెపి నేత. ఆయన ఎప్పుడూ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు అని ఒక పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డిని తన సొంత సోదరిగా చెప్పుకుంటారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని తండ్రిగా భావిస్తారు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులు నమోదైన తరువాత గాలి జనార్దన్ రెడ్డి తనకు ఎవరో తెలియదని జగన్ తప్పించుకున్నారు. అయితే సగటు రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి వారిద్దరి మధ్య ఉన్న బంధం తెలుసు. ఓబులాపురం మైనింగ్ అనుమతులు ఏ ప్రభుత్వంలో వచ్చాయి అన్న విషయం కూడా అందరికీ విధితమే. జనార్దన్ రెడ్డి తనకు ఎవరు తెలియదు అన్నంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు.
* అప్పట్లో అదో ప్లాన్..
వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) గెలవకపోతే.. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి పొలిటికల్ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే గాలి బ్రదర్స్ యువజన, శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తేడా వస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేసి.. బళ్లారి ని కూడా కలిపి సొంత రాష్ట్రంగా ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేశారు. అయితే 2019లో బిజెపి అజేయమైన శక్తిగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అందుకే గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. మళ్లీ పార్టీ పెట్టారు. మరోసారి కూడా బిజెపిలోనే విలీనం చేశారు. అయితే ఇప్పుడు బిజెపిలో ఉన్నా.. గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం అక్రమ మైనింగ్ కేసులో శిక్ష పడడం జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఆందోళన కలిగిస్తోంది.
* ఆ తీర్పు పర్యవసానాలతో..
2011లో అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అత్యంత క్లిష్టమైన కేసుగా సిబిఐ అభివర్ణించింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా చివరకు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన రెడ్డి అక్రమాస్తుల కేసులో అన్ని కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. పైగా రాజకీయ ప్రత్యర్థులు స్ట్రాంగ్ అయ్యారు. వారికి కేంద్రం అండదండలు ఉన్నాయి. కచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి కేసును పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.