
ప్రముఖ యోగా గురువు, స్వామి శివానంద మరణించారు. ఆయన వయసు 128 ఏళ్లు. వారణాసిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 128 ఏళ్ల పాటు ఆయన జీవించడానికి కారణం యోగాతో పాటు ఆయన జీవన విధానం.. తీసుకునే ఆహారం మాత్రమే. శివానంద 128 ఏళ్లు బతకడానికి ఎలాంటి ఆహార నియామాలు పాటించారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన యోగా గురువు. స్వామి శివానందకు భారతపప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా అందచేసింది.
కాయగూరలతో పాటు…
రాత్రి తొమ్మిది గంటలకల్లా నిద్ర పోవడం, తెల్లవారు జామున మూడు గంటలకు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని తర్వాత యోగా చేస్తారు. కాశీ ఘాట్లలో యోగా సాధనతో పాటు బోధన కూడా చేస్తారు. ఇక కాయగూరలు ఆహారంగా స్వీకరిస్తారు. పండ్లు, ఉడికించిన కూరగాయాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. 1986 ఆగస్టులో ఆయన అవిభాజ్య భారత్ లోని సిల్హెత్ లో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. నిరుపేద కుటుంబంలో జన్మించిన స్వామి శివానంద చిన్న నాటి నుంచి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు.
ఆశ్రమంలో పెరిగి…
ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోవడంతో ఆయన పశ్చిమ బెంగాల్ లోని ఒక ఆశ్రమంలో పెరిగారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా కుష్టురోగులకు సేవ చేసి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఇటీవల జరిగిన ప్రయాగరాజ్ కుంభమేళాకు కూడా స్వామి శివనందవచ్చారు. అక్కడే ఉండి పుణ్యస్నానాలు ఆచరించేవారు. శివానందను చూసేందుకు పెద్దసంఖ్యలో బభక్తులు తరలి వచ్చారు. తన పని తాను చేసుకునే స్వామి శివానంద ప్రతి కుంభమేళాకు హాజరవుతూ వచ్చారు.
ధ్యానంతో పాటు.. ఆహారం…
ఉదయం ధ్యానం నుంచి ఆయన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. స్వామి కేవలం నూనె, ఉప్పులేని ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. పాలపదార్ధాలకు దూరంగా ఉంటారు. రాత్రి తొమ్మిదింటికి నిద్రపోయి ఉదయం మూడు గంటలకు నిద్రలేదస్తారు. యోగా చేస్తారు. స్వామీజీ 128 ఏళ్లు బతకడంతో పాటు తన పనులు తానే చేసుకోవడం చూసి ఆయనను దైవ స్వరూపుడిగా భావించి ఆయన దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రయాగరాజ్ లో క్యూ కట్టారు స్వామి శివానంద మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు.