
మే 8న పాకిస్తాన్ భారత్ మీదకు దాడులకు తెగబడింది. పౌర, సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ఉద్రిక్త పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 7న ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది, అయితే పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. కానీ పాకిస్థాన్ మాత్రం జనావాసాలపై దాడులకు తెగబడింది. భారతదేశం డ్రోన్లు, క్షిపణులను అడ్డగించడమే కాకుండా, పాకిస్తాన్ యుద్ధ విమానాలను, వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను (AWACS) కూడా కూల్చివేసింది.
అయితే పాకిస్థాన్ కు చెందిన యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసిందంటూ కూడా పలు కథనాలను మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
“పఠాన్ కోట్ సెక్టార్లో పాక్ ప్రయోగించిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా ఉంది. ఈ ఫైటర్ జెట్ పైలట్‌ను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.” అంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఇందులో ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు కూడా ఉంది. కొన్ని ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
భారత ఆర్మీ అదుపులో పాక్ సైనికుడు ఉన్నాడంటూ వైరల్ అవుతున్న విజువల్స్ ఇటీవలివి కావు.
వైరల్ అవుతున్న విజువల్స్ ను భారత రక్షణ దళాలు ఏమైనా పోస్టు చేశాయా అని తెలుసుకోడానికి మేము పలు సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాం. అయితే వాటిలో ఎక్కడా కూడా ఈ విజువల్స్ ను పంచుకోలేదు.
పాకిస్థాన్ పలు డ్రోన్స్ ను భారత్ మీదకు ప్రయోగించిందని, వాటిని అడ్డుకున్నట్లుగా భారత ఆర్మీ ఓ వీడియోను ప్రచురించింది. అందులో ఓ డ్రోన్ ను కూల్చివేస్తున్నట్లు విజువల్స్ ఉన్నాయి.
ఇక వైరల్ అవుతున్న విజువల్స్ ను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 2016 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని మేము గుర్తించాం.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఆ ఫోటో విజువల్ మీడియా కంపెనీ, స్టాక్ ఇమేజ్ ప్రొవైడర్ గెట్టి ఇమేజెస్ వెబ్సైట్లో కనిపించింది.
ఆ చిత్రంతో పాటు ఈ క్రింది శీర్షిక ఉంది: “డిసెంబర్ 12, 2016న దియార్‌బాకిర్‌లో కూలిపోయిన టర్కిష్ F-16 యుద్ధ విమానం సమీపంలో టర్కిష్ సైనిక సిబ్బంది చేరుకున్నారు. సైన్యం ప్రకారం, పైలట్ విమానం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి కారణం వెంటనే తెలియలేదు, కానీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది.(ఫోటో క్రెడిట్: ILYAS AKENGIN/AFP via Getty Images).” అని ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోను 2016లో https://maailm.postimees.ee/ పోస్టు చేసిన కథనంలో చూడొచ్చు.
https://maailm.postimees.ee/3944055/turgi-kaguosas-kukkus-alla-turgi-havitaja-piloot-katapulteerus
ఈ వెబ్సైట్ లో పోస్టు చేసిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.