
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ లోని కొన్ని విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఉత్తర భారత దేశంలోని తొమ్మిది ఎయిర్ పోర్టులను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ విమానాశ్రయాలను మూసివేయాలని నిర్ణయించింది.
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ…
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ విమానాశ్రయాలు తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు మరికొన్ని ఎయిర్ పోర్టుల్లో కూడా హై అలెర్ట్ ను ప్రకటించింది. పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశముందని భావించి ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలను ప్రారంభించింది.