
నేడు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిని కైవసం చేసుకున్న కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మేయర్ పదవి తన ఖాతాలో పడటంతో ఇక డిప్యూటీ మేయర్ పదవి కూడా కూటమి పార్టీకి దక్కే అవకాశాలున్నాయి. అయితే వైసీపీ ఈ ఎన్నికకు హాజరవుతుందా? గైర్హాజరై నిరసన వ్యక్తం చేస్తుందా? అన్నది చూడాలి.
జనసేన పట్టు…
అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీలో ముగ్గురు పోటీ పడుతున్నారు. మరొకవైపు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ జనసేన పట్టు పడుతుంది. అయితే ఎవరికి ఈ పదవి లభిస్తుందన్న దానిపై చివరి నిమిషంలో పార్టీ నాయకత్వాలు క్లారిటీ ఇవ్వనున్నాయి. మేయర్ ను దించేయడంతో అదే సామాజికవర్గానికి చెందిన వారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉంది.