
స్వీట్లు పంచి.. కేక్ కట్ చేస్తాడు
పూణే ప్రాంతంలోని డాక్టర్ గణేష్ రఖ్ అనే వైద్యుడు ఉన్నాడు. ఈయనకు సొంతంగా ఆస్పత్రి ఉంది. ఆసుపత్రికి ప్రసవం నిమిత్తం ఎవరైనా గర్భిణీ వస్తే.. ఆమెకు చేసిన ఆపరేషన్ లో ఆడపిల్ల పుడితే.. గణేష్ ముఖంలో ఎక్కడా లేని ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఆ ఆనందాన్ని సరికొత్త విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కేక్ తీసుకొస్తాడు.. ఆ ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లితో కట్ చేయిస్తాడు. స్వీట్లు తీసుకొచ్చి ఆసుపత్రి మొత్తం పంచుతాడు. అంతేకాదు ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు గానూ.. ఉచితంగానే ఆపరేషన్ చేస్తాడు.. ఇలా 2012 నుంచి ఇప్పటివరకు దాదాపు డాక్టర్ గణేష్ రెండు వేల ఆపరేషన్లు ఉచితంగా చేశాడు. దాదాపు 2000 మంది ఆడపిల్లలకు అతడు ప్రాణదాతగా నిలిచాడు.. ఆడపిల్ల అంటే విపరీతమైన హేయమైన భావన కొనసాగుతున్న ఈ కాలంలో.. ఇలాంటి వైద్యుడు ఉండడం నిజంగా గొప్ప విషయమే.. అన్నట్టు ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం అభినందించదగ్గ పరిణామమే.” అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానమే. ప్రతి అమ్మాయి కూడా ఈ భూమి మీద పుట్టడానికి.. పెరగడానికి.. ఎదగడానికి అర్హురాలు. ప్రతి వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఆమె అర్హురాలు. ఈ సందర్భంలోనూ ఆడపిల్ల అంటే చిన్న చూపు వద్దు. నిర్లక్ష్యం అసలు వద్దు. ఆమె అభివృద్ధి చెందుతుంటే చూడాలి. ఎందుకంటే ఆడపిల్ల వల్లే సమాజం బాగుపడుతుంది. సమాజం అంతకంతకు విస్తరిస్తుంది. ఆడపిల్లల్ని పుట్టనీయకపోవడం వల్ల సమాజం ఏమాత్రం బాగుపడదు.. అందువల్ల ఆడపిల్లకు స్వేచ్ఛ ఇవ్వాలి.. అన్నింటికీ మించి ఆమెను పుట్టనివ్వాలి. ఎదగనివ్వాలి.. అభివృద్ధి చెందే అవకాశం ఇవ్వాలని” గణేష్ చెబుతుంటారు.