
పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పహాల్గామ్ లో 26 మంది అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ ఘటన జరిగింది. దాడి చేశామని సోషల్ మీడిాయలో టీఆర్ఎఫ్ బాహాటంగా ప్రకటించిందని తెలిపారు. పహాల్గామ్ దాడి వెనక పాకిస్థాన్ అండదండలున్నట్లు రుజువులున్నాయని తెలిపారు. టీఆర్ఎఫ్ కు పాకిస్థాన్ సహకారం ఉందని తెలిపారు. కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ దాడి చేసినట్లు అర్ధమవుతుందని తెలిపారు. అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిందని తెలిపారు.
తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై…
ఈ ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉందని, టీఆర్ఎస్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్థావరంగా మారిపోయిందన్నారు. ఉగ్రమూకల శిబిరాలను నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని చెప్పారు.టీఆర్ఎఫ్ గురించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశామని తెలిపారు.గత ముప్ఫయి ఏళ్లలో ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తుందని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిందని తెలిపారు. ఎల్ఓసీలోని బింబర్ క్యాంప్ పై దాడి చేశామని చెప్పారు. ఇక్కడే లష్కర్ తోయిబా క్యాంప్ జరుగుతుందని కల్నల్ సోఫియా తెలిపారు. మురిద్కే క్యాంప్ పై దాడి చేశామని తెలిపారు. ఇక్కడి నుంచే ముంబయి లో ఉగ్రవాదుల దాడికి ప్లాన్ జరిగిందని, కసబ్ కూడా ఇక్కడ శిక్షణ పొందరాని కల్నల్ సోఫియా తెలిపారు. పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేశామన్నారు. పాకిస్థాన్ లోని సర్జకల్ క్యాంప్ పై దాడి చేశామని విరవరించారు.