
అప్పు ఎవరైనా చేస్తారు. కానీ ఆర్థిక భారం పడకుండా చూసుకోవడమే అసలైన విధి. అయితే అప్పు చేసిన వారు ముందుగా పెద్ద అప్పు కంటే చిన్న అప్పు తీర్చడం ప్రారంభించాలి. చిన్న అప్పు తీర్చడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో పెద్ద అప్పు తీర్చాలని ఆసక్తి పెరుగుతుంది. అలా చిన్నచిన్న అప్పులను తీసివేసి ఆ తర్వాత ఒకేసారి పెద్ద అప్పును త్వరగా క్లియర్ చేసుకుని అవకాశం ఉంటుంది.
కొన్ని అప్పులపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని అప్పులపై వడ్డీ తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువగా వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తీర్చే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక భారం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా వడ్డీ ఉన్న అప్పులను తీసివేయడానికి తక్కువ వడ్డీతో ఉండే అప్పులను చేయవచ్చు. అలా మెల్లిగా ఈ అప్పును కూడా తీసివేయాలి.
పలు కారణాలవల్ల చాలా అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే ఇలా రకరకాల అప్పుల వల్ల వడ్డీ భారం అధికంగా ఉంటుంది. వీటన్నిటికంటే ఒకే అప్పు ద్వారా తీర్చే ప్రయత్నం చేయాలి. అంటే నాలుగు ఐదు అప్పులను తీర్చడానికి బ్యాంకు నుంచి తక్కువ వడ్డీతో రుణం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే అప్పును ఈఎంఐ ద్వారా క్లియర్ చేసుకుని అవకాశం ఉంటుంది.
అప్పులు ఎక్కువై ఆర్థిక భారం పడినప్పుడు కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. అయితే ఈ అప్పులను తీర్చే మార్గం కోసం తక్కువ వడ్డీతో అప్పులు తీసుకోవచ్చు. అయితే ఈ కొత్తగా తీసుకుని అప్పు భారం కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఇతర కారణాల కోసం కొత్త ఆపులను చేయకుండా ఉండాలి.
సాధారణంగా ఇంటి అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తే పర్వాలేదు. కానీ విలాసాల కోసం అప్పులు చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిపోతుంది. అయితే అప్పులు ఎక్కువ అయినప్పుడు విలాసాలను తగ్గించుకోవాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
అప్పులు బాగా పెరిగిపోయినప్పుడు క్రెడిట్ కార్డు లేదా యూపీఐ వాడడం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఉంటుంది. దీంతో ఎంత అప్పు ఉందో తెలియకుండా ఉండి ఆర్థిక భారం పెరిగిపోతుంది.