
కరోనా మళ్లీ ముప్పు తెస్తోంది: అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాపాయం
దేశంలో కరోనా మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. కొద్దికొద్దిగా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు కూడా గుర్తించబడుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కేసులు తక్కువగానే ఉన్నా, వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
-
మాస్క్ ధరించాలి – ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, రద్దీ గల ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
-
భౌతిక దూరం పాటించాలి – ఇతరులతో కనీసం 6 అడుగుల దూరం పాటించండి.
-
చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి – సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించాలి.
-
రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దు – అవసరం ఉన్నప్పటికీ సామూహిక సమావేశాలు, పార్టీలు, ప్రార్థనలలో పాల్గొనడం తగ్గించాలి.
-
వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలి – ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
-
లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి – జ్వరం, దగ్గు, గొంతునొప్పి లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
-
విదేశాల నుంచి వచ్చిన వారు పరీక్షలు చేయించుకోవాలి – ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి తిరిగి వచ్చినవారు జాగ్రత్తగా ఉండాలి.
కరోనా సాధారణ లక్షణాలు:
-
జ్వరం లేదా చలి
-
దగ్గు
-
అలసట
-
గొంతునొప్పి
-
వాసన లేదా రుచి కోల్పోవడం
-
తలనొప్పి
-
శరీర నొప్పులు
-
ముక్కు కారడం లేదా దిబ్బడ
-
వికారం, వాంతులు లేదా విరేచనాలు
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకొని, ఇంటిలోనే క్వారంటైన్ లో ఉండాలి.
తాజా కేసు – విశాఖపట్నంలో కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని, స్వల్ప లక్షణాలైనా కనిపించినా వైద్యులను సంప్రదించాలని కోరుతోంది.
ఇంకా కరోనా ముగిసిపోలేదు. జాగ్రత్తలే మనకే రక్ష. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే — మాస్క్, దూరం, శుభ్రత తప్పనిసరి!