
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఆసియాదేశాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. మాస్క్ లను విధిగా ధరించడంతో పాటు భౌతికదూరం, శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి చేయాలని సూచి్తుంది
హాంకాంగ్, సింగపూర్ లో…
హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్ విజృంభిస్తుంది. ఈ దేశాల్లో మాస్క్ ను కంపలర్సీగా ధరించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. సింగపూర్ లో 14,200 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలిందని చెప్పారు. కొవిడ్ విజృంభణతో సింగపూర్, హాంకాంగ్ అధికారులు మాస్క్ లను తప్పనిసరి చేశారు.