CM Chandrababu Green Singal…
అర్హత ఉన్నవాళ్లు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చని.. అధికారులు సూచిస్తున్నారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అర్హురాలి ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి. ఏప్రిల్ 25 నుంచే అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30లోపు ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం వెరిఫై చేసి మే 1న పింఛను సొమ్ము అందజేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ లోపు నమోదు చేసుకోలేకపోతే.. వారికి జూన్ 1 నుంచి పింఛన్ నగదు ఇస్తారు. ఈ తాజా నిర్ణయం కారణంగా, ప్రభుత్వంపై నెలవారీగా రూ 35.91 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని భావిస్తున్నారు.
