అప్పట్లో ఆనంద్ హర్షవర్ధన్ బాల నటుడిగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సౌందర్య తో కలిసి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆనంద్ హర్షవర్ధన్ బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆనంద్ జగపతిబాబు, సౌందర్య, మహేశ్వరి ప్రధాన పాత్రలలో నటించిన ప్రియరాగాలు సినిమాలో హీరోయిన్ సౌందర్య కొడుకుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలో కూడా వెంకటేష్, మీనాల కొడుకుగా నటించాడు.
ఇతను తెలుగులో ప్రముఖ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ పీబి శ్రీనివాస్ మనవడు. బాల రామాయణం సినిమాలో ఆనంద్ హర్షవర్ధన్ వాల్మీకి, బాల హనుమాన్ పాత్రలలో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్ హర్షవర్ధన్ హీరోగా జహాపనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఆనంద్ హర్షవర్ధన్ బాల నటుడిగా ప్రియరాగాలు, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా, పెళ్లి పందిరి, మనసంతా నువ్వే, మావిడాకులు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆనంద్ హర్షవర్ధన్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు.
