
Childhood Photo : సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత చేసిన అన్ని సినిమాలు హిట్ అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్టును షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈమె స్కూల్లో టాపర్. స్కూల్లో చిన్నప్పుడు టాపర్ గా ఉన్న ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో కూడా గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో ఈమె పేరు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే అందరూ ఈమె వరుసగా సినిమా అవకాశాలను అందుకొని స్టార్ స్టేటస్ సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుంది అని అనుకున్నారు. కానీ అలా ఏమాత్రం జరగలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
వరుసగా ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈమె చదువులో టాపర్. ఈమె స్కూల్ డేస్ లో పేపర్ యాడ్ లో వచ్చిన ఒక త్రో బ్యాక్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టగలరా. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. వరుసగా విజయాలు అందుకున్న కూడా ఎందుకు ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్స్ ను అందుకోలేక పోతుంది. తెలుగులో వరుస అవకాశాలతో స్టార్ బ్యూటీగా దూసుకు వెళ్లాల్సిన ఈ హీరోయిన్ ప్రస్తుతం చేతిలో ఒక సినిమాతోనే నెట్టుకొస్తుంది. ఈమె తెలుగుతోపాటు తమిళ్, మలయాళం లో కూడా అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు సంయుక్తా మీనన్. కొన్ని రోజుల క్రితం సంయుక్త మీనన్ స్కూల్ డేస్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అప్పటి అందమైన క్షణాలను చాలా మిస్ అవుతున్నాను అంటూ తన స్కూల్ డేస్ కి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది సంయుక్త మీనన్. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్నది సంయుక్త మీనన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మలయాళీ సినిమాతో సంయుక్త మీనన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తెలుగులో విరూపాక్ష, సార్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత సంయుక్త మీనన్‌కు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న స్వయంభు చిత్రం తో బిజీగా ఉంది.