
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంల విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అనంతరం మంత్రివర్గ సమావేశంలో పాల్గొనునున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
వివిధ శాఖలపై సమీక్ష…
కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పరిహారంపై చర్చించనున్నారు. అనంతరం 3.15 గంటలకు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.