
కుటుంబ పెద్ద అయినా వ్యక్తికి చాలామంది చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కొందరు కుటుంబ సభ్యుల గురించి చెడుగా కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయాలను పట్టించుకోవడంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. బయటి వారి కోసం ఇంట్లో వారిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇతరులు చెప్పిన విషయాలను పరిశీలించాలి. వారు చెప్పింది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఇతరులు చెప్పిన విషయాలకు వెంటనే స్పందించకూడదు. అలా స్పందిస్తే కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయం ఏర్పడతాయి. ఎవరి మాటలు వినకపోవడంతోనే కుటుంబ పెద్ద కు గౌరవం ఉంటుంది.
కుటుంబ బాధ్యత అంతా ఒకే వ్యక్తిపై ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ నిర్వహణకు సంబంధించిన డబ్బు కూడా తనువాదే ఉంటుంది. అయితే తన వద్ద డబ్బు ఉన్నప్పుడు బాధ్యతగా ఖర్చు పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం లేదా డబ్బులు పొదుపు చేయడం వంటి లోపాలు ఏర్పడితే ఆర్థిక భారం ఏర్పడుతుంది. దీంతో కుటుంబం మొత్తం పేదరికంలో పడిపోతుంది. ప్రతి పైసా గురించి కుటుంబ సభ్యులకు లెక్క చెబుతూ ఉండాలి. అంతేకాకుండా తప్పుడు పనులకు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఇంట్లో వాళ్ళు సైతం అవసరమైన మేరకు మాత్రమే ఖర్చు చేసే విధంగా వారికి చెబుతూ ఉండాలి.
చాణక్య నీతి ప్రకారం కుటుంబ పెద్ద కు సభ్యులు అందరూ ఒక్కటె అన్న భావనతో ఉండాలి. వారి మధ్య వివక్ష చూపించడంతో కొందరి దృష్టిలో చెడ్డవారిగా మారిపోతారు. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి వారు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అందరిని ఒకే చూపుతో చూస్తూ ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్లు ప్రవర్తించకూడదు.
కుటుంబ సభ్యులకు ఉండే ప్రధాన లక్షణం క్రమశిక్షణ. ఈ వ్యక్తి క్రమశిక్షణతో లేకపోతే కుటుంబ సభ్యులంతా రోడ్డున పడతారు. అతను సక్రమంగా ఉంటేనే మిగతావారు కూడా ఇతని ఫాలో అవుతూ ఉంటారు. ఇతను చెడు పనులు చేస్తే వారు కూడా అదే చేస్తారు. దీంతో మిగతావారు కూడా నష్టపోతారు. అందువల్ల ఇంటి యజమాని ఎప్పుడూ క్రమశిక్షణతో కలిగి ఉండాలి. కుటుంబాన్ని నడిపే సమయంలో అందరితో కలుపుగోలుగా ఉండాలి.
ఎలాంటి సమయంలోనైనా మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం కుటుంబ పెద్ద చేస్తూ ఉండాలి. ఆపద సమయంలో తీసుకుని నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. అయితే ఇవి లాభాన్ని తీసుకొస్తాయా? నష్టాన్ని తీసుకొస్తాయా? అనేది జాగ్రత్తగా పరిశీలించాలి.