
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రాని వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్ములైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది. మొత్తం మూడు విడతలుగా ఏడాది లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద జమ అయ్యే నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తుండటంతో దీనికి ప్రాదాన్యత పెరిగింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 9.8 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.
పెట్టుబడి సాయం కింద…
రైతులకు పెట్టుబడి సాయం కింద అంటే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ నిధులు పనికొస్తాయని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే చాలా మంది అర్హత ఉన్నా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని పొందలేకపోతున్నారు. కొందరు తమ బ్యాంకు ఖాతాలను ఈకేవైసీ చేసుకోకపోవడంతో వారి ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. అదే సయంలో మరికొన్ని ఇబ్బందులు కూడా రైతులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకూ ఈ పథకం పొందని వారు కూడా పొందే అవకాశాన్ని దక్కించుకోగలుగుతారు.
వీరిని కలిస్తే…
కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వర్తింప చేయాలన్న నిర్ణయంతో జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది. అర్హత ఉండి ఈ పథకం కింద డబ్బులు పడని రైతులు నోడల్ అధికారులను కలసి తమకు సంబంధించిన అర్హతలను తెలియచేసి వారి దృష్టికి తీసుకెళ్తే సమస్య కు పరిష్కారం దొరుకుతుంది. నోడల్ అధికారికి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించి ఈ పథకం కింద నిధులు జమఅవుతాయని కేంద్రంప్రభుత్వం చెబతుుంది. ఇప్పటి వరకూ 19 విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. 20వ విడత నిధులను జూన్ నెలలో జమ చేసే అవకాశముంది.