
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో నౌకల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. నౌకల మరమ్మతు కేంద్రాన్ని దుగ్గరాజు పట్నంలో ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. దీనిపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బృందం రేపు రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానుంది.
నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు…
ఏపీలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటయితే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపింది. దుగ్గరాజుపట్నంలో ఏర్పాటు చేస్తే స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నౌకల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణతో పాటు అనేక అంశాలపై రేపు కేంద్ర బృందం చంద్రబాబు నాయుడు తో చర్చించనుంది.