
తల్లిగా పసిబిడ్డతో..
కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు యాషికా అప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు నాలుగు సంవత్సరాల వయసు ఉండగా మరోసారి ఆమె గర్భం దాల్చారు. అప్పటికే కార్గిల్ యుద్ధం మొదలు కావడంతో.. తను గర్భవతిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె కదన రంగంలోకి దిగారు. ఒక చేతితో బిడ్డను మోస్తూ.. మరో బిడ్డను గర్భంలో మోస్తూ ఆమె యుద్ధం చేశారు. ప్రస్తుతం శత్రుదేశంతో మనకు అత్యంత కఠినమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాషికా గురించి నేషనల్ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ” నాడు ఆమె దేశం కోసం మాత్రమే పోరాడింది. తను ఎలా ఉన్నాను అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. కదనరంగంలో సింహంలాగా రెచ్చిపోయింది. శత్రుమూకలకు తన పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. నాడు యుద్ధంలో ఆమె చూపించిన తెగువను అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా కొనియాడింది. ఆమె చూపించిన తెగువ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు సైన్యంలోకి వచ్చారు… ” ఆమె పోరాటం అద్వితీయం. ఆమె చూపించిన తెగువ అనిర్వచనీయం. యోధురాలిగా పోరాడిన ఆమె.. దేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. ఇలాంటి మహిళలు భారతదేశానికి కావాలి.. ఇలాంటివారు సైన్యంలోకి రావాలి. సైన్యాన్ని బలోపేతం చేయాలి. భారతదేశానికి దృఢత్వాన్ని మరింతగా అందించాలి. ఇటువంటి వారి సేవలు మన దేశానికి అవసరం. ఇలాంటి మహిళల వల్లే మన దేశం ప్రపంచ దేశాల ముందు మరింత శక్తివంతంగా కనిపిస్తుంది.. యాషికా చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఆమె ఈ దేశానికే గర్వకారణం అంటూ” నాటి కేంద్ర ప్రభుత్వం యాషికా ను కొనియాడింది.