
రేపు రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. రేపు సీసీఎస్ సమావేశం తర్వాత రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాలపై కన్నేసిన భారత్ దానిని ఒంటరి చేసే ప్రయత్నం ముమ్మరం చేయాలని నిర్ణయించింది.
నేడు రాయబారుల సమావేశం…
ఆపరేషన్ సింధూర్ తో పాటు తాము ఎక్కెడెక్కడ దాడులు నిర్వహించిందీ? పాక్ నిర్వహించిన దాడుల గురించి వీడియోలతో సహా నేడు జరిగే అన్ని దేశాల రాయబారుల సమావేశంలో తెలపనుంది. పాకిస్తాన్ లో తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందీ వివరించనున్నారు. పహాల్గామ్ దాడి తర్వాతనే ఇది జరిగిందన్న విషయాన్ని గుర్తు చేయనున్న భారత ప్రభుత్వం పాక్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయమిస్తుందో సవివరంగా తెలియజేసి ఆపరేషన్ సిందూర్ కు అందరి మద్దతు కావాలని కోరనుంది.