
గుంతకల్లులో కాంగ్రెస్ నేత దారుణ హత్య కలకలం రేపింది. అయితే ఈ హత్య వెనక ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరి నారాయణ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భూవివాదాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి లక్ష్మీనారాయణను టిప్పర్‌తో ఢీకొట్టి, కత్తులతో దుండగులు ఇటీవల హత్య చేసిన సంగతి తెలిసిందే.
డబ్బులు సమకూర్చారంటూ…
హత్యకు ప్రధాన నిందితుడు గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ 3.5 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హేరకు సాంకేతిక ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకుని గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో న్యాయస్థానం పథ్నాలుగు రోజులు రిమాండ్ తెలిపింది.