Brief News Across Andhra Pradesh- 24th April 2025
- పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా అధికారులను ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష నిర్వహించారు.
- విశాఖ గోపాలపట్నం బాలురా బాలికల హై స్కూల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు 54 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ మేళాను ఎంపి భరత్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
- ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో ట్పుల్ఐటి నిర్మాణానికి డైరెక్టర్ భాస్కర్ పటేల్ బృందం భూములను పరిశీలించింది గతంలో పామూరు మండలం దోమగుంలలో ఎంపిక చేసిన భూములను కూడా పరిశీలించారు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి కూడా పాల్గొన్నారు.
- కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను ఎంపి బస్తిపాటి నాగరాజు కోరారు కర్నూల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన జైన్‌ను ఎంపీ కలిశారు.
- శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నగర పంచాయతీ వైసపి చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు 15 మంది వైసపి కౌన్సిలర్లలో కొందరు టీడిపీలో చేరారు కూటమి సంఖ్యాబలం పెరిగిన వేళ కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీస్ అందించారు.
- పహల్గాలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో పోలీస్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను కళ్ళకు కట్టారు.
- కర్నూలు జిల్లా పెంచుకలపాడు విశ్వభారతీ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ మొదటి ఏడాది విద్యార్థిని హన్సిక ఆత్మహత్యా యత్నం చేసింది చదువు వత్తిడి వల్ల కళాశాల భవనం పై నుంచి దూకింది హన్సికకు విశ్వభారతీ ఆసుపత్రిలో ఐసయులో చికిత్స అందిస్తున్నారు.
- పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంలో బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు మృతులను తొమ్మిదేళ్ల జస్వంత్ 16 ఏళ్ల యేసురాజుగా గుర్తించారు
- తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో విషాదం చోటు చేసుకుంది కొబ్బరి చెట్టుపై కాయలు తీస్తుండగా విద్యుత్ వైర్ తగిలి 22 ఏళ్ల ధనరాజు అక్కడికక్కడే మరణించాడు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు.
- కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వార్డులో పాము కలకలం రేపింది రోగుల సహాయకులు కర్రలతో పామును కొట్టి చంపారు.
