
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన తనకు అనారోగ్యంతో అమెరికాలో ఉన్నానని, ముందస్తు బెయిల్ వస్తే వచ్చి విచారణకు సహకరిస్తానని పిటీషన్ వేశారు.
ఏ 1 నిందితుడిగా…
అయితే ప్రభాకర్ రావుపై ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును తీసుకు వచ్చేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అతని పాస్ పోర్టును కూడా రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం చేత ఆదేశాలు ఇప్పించారు. ముందస్తు బెయిల్ మంజూరయితే వచ్చి విచారణకు సహకరిద్దామనుకున్న ప్రభాకర్ రావుకు హైకోర్టుషాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.